ఇరాన్లో పాలన మారింది... ఇక కలిసి పనిచేస్తాం: ట్రంప్
- ట్రూత్ సోషల్‌లో ట్రంప్ తాజా పోస్ట్.. ఇరాన్‌పై కీలక ప్రకటన
- ఇరాన్ ఇకపై యురేనియం శుద్ధి చేయదని వెల్లడి
- అణు ధూళిని తవ్వి తొలగించేందుకు ఇరాన్ కు సాయం చేచేస్తామని ప్రకటన
- తమ స్పేస్ ఫోర్స్ ఉపగ్రహాలు ఇరాన్ పై ఓ కన్నేసి ఉంచాయని వ్యాఖ్యలు
ఇరాన్ ఇకపై యురేనియం శుద్ధి చేయదని ట్రంప్ తన పోస్టులో స్పష్టం చేశారు. భూమిలో లోతుగా పాతిపెట్టిన అణు ధూళిని తవ్వి తొలగించేందుకు ఇరాన్‌కు అమెరికా సహాయం చేస్తుందని తెలిపారు. ఇరాన్ ప్రస్తుతం అత్యంత కచ్చితమైన శాటిలైట్ నిఘాలో ఉందని, దాడి జరిగిన నాటి నుంచి అక్కడ ఏదీ మార్పు చెందలేదని పేర్కొన్నారు. తమ స్పేస్ ఫోర్స్ ఉపగ్రహాలు ఇరాన్ పై ఓ కన్నేసి ఉంచాయని వివరించారు.
ఇరాన్‌తో టారిఫ్‌లు, ఆంక్షల ఉపశమనంపై తాము చర్చలు జరుపుతామని కూడా ట్రంప్ వెల్లడించారు. ఇరు దేశాల మధ్య ఉన్న 15 డిమాండ్లలో చాలా వాటికి ఇప్పటికే అంగీకారం కుదిరిందని ఆయన తన పోస్టులో వివరించారు.