చండీగఢ్ బీజేపీ కార్యాలయం వద్ద పేలుడు
- పార్క్ చేసి ఉంచిన స్కూటీలో పేలుడు
- సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసు బృందాలు, అగ్నిమాపక సిబ్బంది
- భారీ మొత్తంలో నష్టం జరగలేదన్న బీజేపీ నాయకులు
బీజేపీ సీనియర్ నాయకులు, కార్యాలయంలోని నాయకుల ప్రకారం, ఈ పేలుడు కారణంగా భారీ మొత్తంలో నష్టమేమీ జరగలేదు. విషయం తెలియగానే కార్యాలయం వద్దకు చేరుకున్న పోలీసులు, ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. పేలుడుకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. పంజాబ్ బీజేపీ మాజీ అధ్యక్షుడు అశ్వని శర్మ పేలుడుకు సంబంధించిన ఫొటోలను తన సామాజిక మాధ్యమ ఖాతాల ద్వారా పంచుకున్నారు.