బందరులో ఒక బఫూన్ ఉన్నాడు: మంత్రి కొల్లు రవీంద్ర
- మంగళగిరి టీడీపీ ఆఫీసులో మంత్రి కొల్లు రవీంద్ర మీడియా సమావేశం
- వైసీపీ నేత పేర్ని నానిపై తీవ్ర విమర్శలు
- మడ అడవులు ఆక్రమించి పేర్ని నాని అక్రమంగా చెరువులు తవ్వారన్న ఆరోపణ
- తప్పు చేసిన వారిని ఎవరినీ వదిలిపెట్టబోమని అధికారులకు ఆదేశాలిచ్చినట్లు వెల్లడి
"బందరులో ఒక బఫూన్ ఉన్నాడు. షాడోలను అడ్డుపెట్టుకుని అక్రమంగా చెరువులు తవ్వించాడు. మడ అడవులను సైతం ఆక్రమించి చెరువులుగా మార్చేశాడు" అని పేర్ని నానిని ఉద్దేశించి కొల్లు రవీంద్ర ఆరోపించారు. అధికారులను బ్లాక్ మెయిల్ చేసి భూములు దోచుకోవడానికి నాని ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు.
కూటమి ప్రభుత్వంలో ఇలాంటి అక్రమాలకు తావులేదని స్పష్టం చేశారు. తప్పు చేస్తే ఎవరినీ ఉపేక్షించవద్దని ఇప్పటికే అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామని మంత్రి తెలిపారు.