పొరపాటున అలా మాట్లాడాను.. 'పెద్ది' టీమ్‌కు ఎస్‌కేఎన్ క్షమాపణ
- 'పెద్ది' విడుదల వాయిదా పడిందంటూ ఎస్‌కేఎన్ వ్యాఖ్యలు
- పొరపాటున అలా మాట్లాడానని వీడియో ద్వారా వివరణ
- తన సినిమా రిలీజ్ డేట్ గురించి చెబుతూ ఈ వ్యాఖ్యలు చేసినట్లు స్పష్టీకరణ
- 'పెద్ది' అనుకున్న టైమ్‌కే విడుదలై విజయం సాధించాలని ఆకాంక్ష
అసలేం జరిగిందంటే.. ఎస్‌కేఎన్ తన సొంత నిర్మాణ సంస్థలో వస్తున్న 'చెన్నై లవ్ స్టోరీ' సినిమా విడుదల తేదీని ప్రకటించే క్రమంలో నిన్న రాత్రి 'పెద్ది' గురించి మాట్లాడారు. ఏ పెద్ద సినిమా విడుదలయ్యే తేదీలో తమ చిత్రాన్ని తీసుకురావొద్దనే ఉద్దేశంతోనే తాను అలా వ్యాఖ్యానించానని, కానీ అది పొరపాటుగా దొర్లిందని వివరించారు.
ఈ సందర్భంగా 'పెద్ది' సినిమా గురించి ఆయన సానుకూలంగా మాట్లాడారు. ఆ చిత్రం అనుకున్న సమయానికే విడుదలై ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. నిర్మాత ఎస్‌కేఎన్ తాజా వివరణతో ఈ అంశంపై నెలకొన్న గందరగోళానికి తెరపడినట్లయింది.