ఆడి బాటలోనే మెర్సిడెస్ బెంజ్... భారత్ లో పెరగనున్న కార్ల ధరలు
- మెర్సిడెస్ బెంజ్ కార్ల ధరలు 2 శాతం పెంపు
- ఏప్రిల్ 1 నుంచి కొత్త ధరలు అమల్లోకి
- ముడిసరుకుల ధరలు, రూపాయి విలువ క్షీణతే కారణం
- ఇప్పటికే ఆడి ఇండియా ధరల పెంపు
ఈ విషయంపై కంపెనీ సేల్స్ అండ్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ బ్రెండన్ సిసింగ్ మాట్లాడుతూ.. "ముఖ్యంగా యూరోతో పోలిస్తే భారత రూపాయి విలువ తగ్గడం వల్ల నిర్వహణ ఖర్చులు పెరిగాయి. వ్యాపార సుస్థిరత కోసం ఈ ధరల సవరణ తప్పనిసరి అయింది. ఏప్రిల్ 1 నుంచి మా పోర్ట్‌ఫోలియో అంతటా సుమారు 2 శాతం ధరల పెంపును అమలు చేస్తున్నాం" అని తెలిపారు. అయితే, ఈ పెంపు ప్రభావం వినియోగదారులపై వీలైనంత తక్కువగా ఉండేలా చూస్తామని, అత్యుత్తమ ఉత్పత్తులు, సేవలు అందించడంపై తమ దృష్టి కొనసాగుతుందని ఆయన హామీ ఇచ్చారు.
ఇదిలా ఉండగా, మరో జర్మన్ లగ్జరీ కార్ల సంస్థ ఆడి ఇండియా ఇప్పటికే ధరల పెంపు నిర్ణయం తీసుకుంది. తమ కార్ల ధరలను ఏప్రిల్ 1 నుంచి 2 శాతం వరకు పెంచుతున్నట్లు ఈ వారంలోనే ప్రకటించింది. ముడిసరుకుల ధరలు, కరెన్సీ రేట్లలో మార్పులే ఇందుకు కారణమని ఆడి కూడా స్పష్టం చేసింది. దీంతో ఏప్రిల్ నుంచి రెండు ప్రధాన జర్మన్ లగ్జరీ కార్ల బ్రాండ్ల ధరలు పెరగనున్నాయి.