నాంపల్లి కోర్టు సహా కరీంనగర్, రాజమండ్రి జైళ్లకు బాంబు బెదిరింపులు
- మధ్యాహ్నం 12.05 గంటలకు బాంబు పేలుతుందంటూ బెదిరింపు
- సిబ్బందిని బయటకు పంపించి బాంబు స్క్వాడ్ తనిఖీలు
- నాంపల్లి, కరీంనగర్, రాజమండ్రి జైళ్లకు బెదిరింపు కాల్
నాంపల్లి క్రిమినల్ కోర్టుతో పాటు తెలుగు రాష్ట్రాలలో పలు న్యాయస్థానాలకు కూడా బాంబు బెదిరింపులు వచ్చాయి. కరీంనగర్, రాజమండ్రి జైళ్లకు కూడా బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. దీంతో ఆయా కోర్టులలో ఉన్న సిబ్బందిని బయటకు పంపించి బాంబు స్క్వాడ్ తనిఖీలు చేపట్టింది. అయితే ఇప్పటి వరకు ఎక్కడా అనుమానాస్పద వస్తువులు లభ్యం కాలేదు. తనిఖీలు కొనసాగుతున్నాయి. అయితే వీటిని ఫేక్ బెదిరింపులుగా భావిస్తున్నారు.