రూ.20 కోట్ల నష్టపరిహారం చెల్లించాలి: ధనుష్‌కు నిర్మాణ సంస్థ లీగల్ నోటీసులు
- ధనుష్‌కు నోటీసులు పంపించిన తేనాండాళ్ ఫిల్మ్స్
- ఒప్పుకున్న సినిమాను పూర్తి చేయడం లేదని ఆరోపణ
- చాలాకాలంగా సినిమా వాయిదా పడుతోందన్న నిర్మాణ సంస్థ
2016లో నిర్మాణ సంస్థ తేనాండాళ్ ఫిల్మ్స్‌పై 'నాన్ రుద్రన్' సినిమాను చేయడానికి ధనుష్ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించాలనుకున్నారు. అయితే తర్వాత దర్శకుడు మారారు. ఈ కారణంగా ధనుష్ తమకు స్క్రిప్ట్ ఇవ్వలేదని, దీంతో తమకు రూ.20 కోట్లు నష్టం వచ్చిందని నిర్మాణ సంస్థ ఆరోపించింది.
ధనుష్ ఇప్పటి వరకు ఈ చిత్రాన్ని ప్రారంభించలేదని దీనిని పక్కన పెట్టి ఇతర చిత్రాలు అంగీకరిస్తున్నారని తేనాండాళ్ ఫిల్మ్స్ లీగల్ నోటీసులు పంపించింది. ధనుష్‌తో కలిసి ఈ సినిమాలో నటించాల్సిన నాగార్జున అక్కినేని, ఎస్.జే. సూర్య వంటి వారికి కొన్ని ఖర్చులు చెల్లించినట్లు తెలిపింది. కాగా దీనిపై ధనుష్ స్పందించాల్సి ఉంది.