తమిళ దర్శకుల సంఘం అధ్యక్షుడిగా ఆర్కే సెల్వమణి ఎన్నిక
- దర్శకుల సంఘం అధ్యక్షుడిగా సెల్వమణి ఏకగ్రీవంగా ఎన్నిక
- ఉపాధ్యక్షులుగా కేఎస్ రవికుమార్, పి. వాసు ఎన్నిక
- ఇంతకు ముందు సంఘానికి సెక్రటరీగా ఉన్న సెల్వమణి
ఐదు జాయింట్ సెక్రటరీ, 17 కార్యవర్గ సభ్యుల పదవులకు ఈనెల 15న ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల అధికారిగా రిటైర్డ్ న్యాయమూర్తి తర్వీశ్ వ్యవహరించనున్నారు. ఈ ఎన్నికల్లో 1,800 మంది సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇంతకు ముందు ఆర్కే సెల్వమణి తమిళ దర్శకుల సంఘానికి సెక్రటరీగా పని చేశారు. ఇప్పుడు అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.