ఏపీ, తెలంగాణలకు హైస్పీడ్ రైళ్లు గేమ్ ఛేంజర్.. బెంగళూరుకు 2 గంటల్లో చేరుకోవచ్చు: అశ్వినీ వైష్ణవ్
- తెలంగాణ, ఏపీ, తమిళనాడు మధ్య ఆర్థిక, హెల్త్ టూరిజం అభివృద్ధి చెందుతుందన్న కేంద్రమంత్రి
- బడ్జెట్‌లో తెలంగాణలో రైల్వే పనులకు రూ.5,454 కోట్లు కేటాయింపు
- హైదరాబాద్ నుంచి చెన్నై, పుణే, బెంగళూరుకు మూడు హైస్పీడ్ రైళ్లు రానున్నాయని వెల్లడి
ఈ హైస్పీడ్ రైళ్లు ఉభయ తెలుగు రాష్ట్రాలకు (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ) గేమ్ ఛేంజర్‌గా మారతాయని వెల్లడించారు. హైదరాబాద్ నుంచి చెన్నై, పుణే, బెంగళూరుకు 3 హైస్పీడ్ రైళ్లు రానున్నాయని, దీంతో హైదరాబాద్ నుంచి బెంగళూరుకు 2 గంటల్లో వెళ్లవచ్చని అన్నారు. పుణేకు గంట 55 నిమిషాలు, చెన్నైకి 2 గంటల 55 నిమిషాల్లో చేరుకోవచ్చని అన్నారు.