రజనీకాంత్ కూలీ ట్రైలర్ వచ్చేసింది
- సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం కూలీ
- ట్రైలర్ విడుదల చేసిన చిత్ర బృందం
ఈ ట్రైలర్ సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచింది. ఇప్పటికే పాటలు మంచి క్రేజ్ తెచ్చుకున్నాయి. ఇప్పుడు ఈ ట్రైలర్ లోకేష్ తనదైన శైలిలో కూలీ ప్రపంచాన్ని అద్భుతంగా ఆవిష్కరించాడన్న అంచనాలు రెట్టింపు చేస్తున్నాయి.
ఈ చిత్రంలో నాగార్జున, ఆమిర్ ఖాన్, ఉపేంద్ర, శ్రుతిహాసన్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాలో రజనీకి విలన్ గా నాగార్జున నటించారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ చిత్రం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ 'కూలీ' చిత్రాన్ని సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. సత్యరాజ్, సౌబిన్ షాహిర్, మహేంద్రన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు.