ఇంకా ఆర్సీబీ గెలుపు కిక్కులోనే ఉన్న రిషి సునాక్... ఫొటోలు ఇవిగో!
- నిన్న అహ్మదాబాద్ లో ఐపీఎల్ ఫైనల్
- పంజాబ్ కింగ్స్ ను ఓడించిన ఆర్సీబీ
- ఐపీఎల్ చరిత్రలో తొలిసారిగా బెంగళూరుకు టైటిల్
- స్టేడియంలో ఆర్సీబీని ఉత్సాహపరుస్తూ ఊగిపోయిన రిషి సునాక్
- నేడు సోషల్ మీడియాలో ఫొటోలు షేర్ చేసిన బ్రిటన్ మాజీ ప్రధాని
ఇక నిన్నటి ఫైనల్ కు ఓ విశిష్ట అతిథి హాజరయ్యారు. ఆయన మరెవరో కాదు.. బ్రిటన్ మాజీ ప్రధాని, ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అల్లుడు రిషి సునాక్. ఆయన ఆర్సీబీకి పెద్ద ఫ్యాన్. ఐపీఎల్ ఫైనల్ వీక్షించేందుకు సతీసమేతంగా భారత్ విచ్చేసిన ఆయన స్టేడియంలో ఓ రేంజిలో సందడి చేశారు. సగటు ఆర్సీబీ అభిమానికి ఏమాత్రం తీసిపోని రీతిలో ఊగిపోయారు. ఇవాళ కూడా రిషి సునాక్ ఇంకా అదే కిక్కులో ఉన్నారు. సోషల్ మీడియాలో మ్యాచ్ సెలబ్రేషన్స్ కు సంబంధించిన ఫొటోలను పంచుకున్నారు. వాట్ ఏ నైట్... ఈ సాల కప్ నమదు (ఈసారి కప్ మనది) అంటూ క్యాప్షన్ పెట్టారు.






