ఎయిర్పోర్ట్ చెత్తబుట్టలో శిశువు మృతదేహం
- ముంబయిలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘటన
- విమానాశ్రయం టెర్మినల్-2లోని వాష్రూమ్ చెత్తబుట్టలో శిశువు మృతదేహం
- ఈ ఘటనతో ప్రయాణికులు, యాజమాన్యం దిగ్భ్రాంతి
మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపి, గుర్తుతెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ముంబయి పోలీసులు తెలిపారు. ఈ దారుణానికి ఎవరు పాల్పడ్డారనే విషయాన్ని తెలుసుకోవడానికి సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. చిన్నారిని హత్య చేసి ఉంటారా? లేదా మృతశిశువు జన్మించడంతో చెత్త డబ్బాలో పడేసి వెళ్లారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.