ఎమ్మెల్సీ ఎన్నికలు.. కాసేపట్లో నామినేషన్ వేయనున్న నాగబాబు
- ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు
- జనసేన నుంచి పోటీ చేస్తున్న నాగబాబు
- నాగబాబును ప్రతిపాదిస్తూ సంతకాలు చేసిన 10 మంది జనసేన ఎమ్మెల్యేలు
నామినేషన్ల దాఖలుకు మార్చి 10వ తేదీ చివరి గడువు. ప్రభుత్వ సెలవురోజులు మినహా ఏ రోజైనా ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. మార్చి 11న ఉదయం 11 గంటలకు నామినేషన్ల పరిశీలన, మార్చి 13న మధ్యాహ్నం 3 గంటల్లోపు ఉపసంహరణకు అవకాశం ఉంటుంది.