అదిరిపోయే ఎంటర్టైన్మెంట్తో 'మ్యాడ్ స్క్వేర్' టీజర్
- 'మ్యాడ్' సీక్వెల్‌గా తెరకెక్కుతున్న 'మ్యాడ్ స్క్వేర్'
- ప్రధాన పాత్రల్లో నార్నె నితిన్, రామ్ నితిన్, సంగీత్ శోభన్
- మార్చి 29న విడుదల కానున్న సినిమా
- కళ్యాణ్ శంకర్ దర్శకత్వం.. భీమ్స్ సిసిరోలియో బాణీలు
మార్చి 29న ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషనల్ కార్యక్రమాలను మొదలుపెట్టారు. అందులో భాగంగా తాజాగా టీజర్‌ను రిలీజ్ చేశారు. ముగ్గురు హీరోలు మరోసారి తమ కామెడీతో కితకితలు పెట్టారు. మొత్తంగా టీజర్ కామెడీ, ఎంటర్టైన్మెంట్తో అదిరిపోయింది.
కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో బాణీలు అందిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.