వైసీపీ సోషల్ మీడియా ఇన్చార్జ్ సజ్జల భార్గవరెడ్డిపై అట్రాసిటీ కేసు
- సింహాద్రిపురానికి చెందిన హరి ఫిర్యాదుతో కేసు నమోదు
- వైసీపీ సోషల్ మీడియాను నడిపిస్తున్న అర్జున్‌రెడ్డి, వర్రా రవీందర్రెడ్డిపైనా నాన్ బెయిలబుల్ కేసులు
- పోస్టులపై ప్రశ్నించినందుకు తనను కులం పేరుతో దూషించారన్న హరి
జగన్‌ను విమర్శించే వారిని లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో గత ఐదేళ్లుగా రవీందర్‌రెడ్డి పోస్టులు పెడుతున్నాడని, దీనిని ప్రశ్నించినందుకు తనను కులం పేరుతో దూషించాడంటూ హరి తన ఫిర్యాదులో ఆరోపించారు. ఆయన ఫిర్యాదుతో ముగ్గురిపైనా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.