చీపురుపల్లిలో మంత్రి బొత్సకు తప్పని పరాజయం... కళా వెంకట్రావు జయభేరి
- ఏపీ మంత్రులకు ఎదురుగాలి
- 11,971 ఓట్ల తేడాతో బొత్స ఓటమి
- చీపురుపల్లిలో బొత్సపై విజయం సాధించిన కళా వెంకట్రావు
- చీపురుపల్లిలో నోటాకు 2,855 ఓట్లు
బొత్సపై టీడీపీ సీనియర్ నేత కిమిడి కళావెంకట్రావు విజయం సాధించారు. మొత్తం 20 రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి కళా వెంకట్రావుకు 88,225 ఓట్లు వచ్చాయి. బొత్సకు 76,254 ఓట్లు పడ్డాయి. మంత్రి బొత్స ప్రాతినిధ్యం వహిస్తున్న చీపురుపల్లి నియోజకవర్గంలో నోటాకు 2,855 ఓట్లు పడడం గమనార్హం.