ఓటు వేసిన రజనీకాంత్, ధనుశ్, విజయ్ సేతుపతి
- చెన్నై పోయెస్ గార్డెన్‌లోని పోలింగ్ బూత్‌కు వచ్చిన రజనీకాంత్
- చెన్నైలోని టీటీకే రోడ్డు పోలింగ్ బూత్‌లో ఓటు వేసిన ధనుశ్
- కిల్పాక్లోని చెన్నై హైస్కూల్లో ఓటు హక్కు వినియోగించుకున్న విజయ్ సేతుపతి
ఓటు వేసిన అనంతరం రజనీకాంత్ అందరికీ అభివాదం చేస్తూ ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లకు తన సిరా వేలిని చూపించారు. నటుడు ధనుష్ టీటీకే రోడ్డులోని సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ పాఠశాలలో ఉదయం 8 గంటలకు ఓటు వేశారు. అలాగే నటులు అజిత్ కుమార్, శివకార్తికేయన్, గౌతమ్ కార్తీక్, దర్శకులు సుందర్ సి, వెట్రి మారన్, శశికుమార్ తదితరులు కూడా ఓటు వేశారు.