అన్నాడీఎంకే పార్టీలో చేరిన సినీ నటి గౌతమి
- 25 ఏళ్లుగా బీజేపీలో ఉన్న గౌతమి
- కష్ట కాలంలో తనకు మద్దతు లభించలేదని ఆవేదన
- పళనిస్వామి నివాసానికి వెళ్లి అన్నాడీఎంకేలో చేరిన గౌతమి
ఇంతకు ముందే బీజేపీపై గౌతమి తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. పార్టీ కోసం క్షేత్ర స్థాయిలో కష్టపడి పని చేశానని... కానీ, కష్ట కాలంలో తనకు తగిన మద్దతు లభించలేదని ఇంతకు ముందు ఆమె వ్యాఖ్యానించారు. ఆ తర్వాత జరిగిన పలు పరిణామాల నేపథ్యంలో... ఈరోజు పళనిస్వామి నివాసానికి వెళ్లి అన్నాడీఎంకే తీర్థం పుచ్చుకున్నారు. ఇటీవలే తమిళ సినీ నటి గాయత్రి రఘురాం కూడా బీజేపీకి గుడ్ బై చెప్పి అన్నాడీఎంకేలో చేరారు.