కోమటిరెడ్డిని కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలి: జెడ్పీ వైస్ చైర్మన్ బిక్కు నాయక్ డిమాండ్
- సందీప్ రెడ్డిపై మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలు సరికాదన్న బిక్కు నాయక్
- బాధ్యత గల హోదాలో ఉన్న మంత్రి ఇష్టానుసారంగా మాట్లాడారని ఆగ్రహం
- రైతులను, ప్రజాప్రతినిధులను చులకనగా చూస్తున్నారని విమర్శ
ఇష్టారీతిన మాట్లాడే మంత్రిని వెంటనే మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చి రెండు నెలలు కూడా గడవకముందే రౌడీల్లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రైతులను, ప్రజాప్రతినిధులను చులకనగా చూస్తున్నారని ఆరోపించారు. మంత్రి కోమటిరెడ్డి ఇలాగే వ్యవహరిస్తే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. కోమటిరెడ్డి నిరంకుశ వైఖరిపై తెలంగాణవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతాయన్నారు.