'జైలర్ 2' నుంచి నయనతారకు పిలుపు?
- బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన 'జైలర్'
- సీక్వెల్ దిశగా మొదలైన సన్నాహాలు
- తెరపైకి వచ్చిన నయనతార పేరు
- భారీ పారితోషికం అందుకుంటున్న నెల్సన్
ఈ సినిమా సీక్వెల్ కి సంబంధించిన కథను రజనీకి వినిపించి నెల్సన్ ఓకే చెప్పించుకున్నాడనే వార్త కొన్ని రోజుల క్రితమే షికారు చేసింది. ఇప్పుడు ఈ సినిమా కోసం నయనతార పేరు తెరపైకి వచ్చింది. ఈ సినిమాలోని ఒక కీలకమైన పాత్ర కోసం నయనతారను సంప్రదిస్తున్నట్టుగా చెబుతున్నారు. ఆ పాత్రకి ఆమె దాదాపు ఖాయమైనట్టేనని అంటున్నారు. ఈ ఇద్దరి కాంబినేషన్లో ఆల్రెడీ నాలుగైదు సినిమాలు వచ్చాయి. మరోసారి 'జైలర్ 2' కోసం కలిసి కనిపించనున్నట్టు తెలుస్తోంది.
'జైలర్' సినిమాలో రజనీకి భార్య పాత్రలో రమ్యకృష్ణ కనిపించింది. ఒకవేళ నయనతారను సంప్రదించడం నిజమే అయితే, ఆమె ఏ పాత్రలో కనిపించనుందనే ఆసక్తి ఆడియన్స్ లో అప్పుడే మొదలైపోయింది. నయనతార మాత్రమే కాదు, ఈ సినిమా కోసం నెల్సన్ అందుకునే పారితోషికం కూడా గట్టిగానే ఉందని అంటున్నారు.