'దేవర' షూటింగ్ లో సైఫ్ అలీ ఖాన్ కు గాయాలు.. ముంబైలో శస్త్రచికిత్స
- సైఫ్ మోకాలు, భుజానికి గాయాలు
- ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చికిత్స
- సైఫ్ పక్కన ఉన్న ఆయన భార్య కరీనా కపూర్
గాయం కారణంగా సైఫ్ కొన్ని రోజుల పాటు 'దేవర' షూటింగ్ కు దూరమయ్యే అవకాశం ఉంది. ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. షెడ్యూల్ ప్రకారం తొలి పార్ట్ ఏప్రిల్ 5న విడుదల కావాల్సి ఉంది. మరోవైపు గాయంపై సైఫ్ స్పందిస్తూ... మన వృత్తిలో భాగమే ఈ గాయాలు, ఆపరేషన్ అని చెప్పారు. నిపుణులైన డాక్టర్ల పర్యవేక్షణలో తాను సురక్షితంగా ఉన్నానని తెలిపారు.