బ్యాటింగ్ పిచ్ లపై వాళ్లిద్దరూ అద్భుతంగా బౌలింగ్ చేశారు: వీవీఎస్ లక్ష్మణ్
- ఆసీస్ తో ముగిసిన 5 మ్యాచ్ ల టీ20 సిరీస్
- 4-1తో సిరీస్ గెలిచిన టీమిండియా
- యువ జట్టు అమోఘంగా ఆడిందంటూ లక్ష్మణ్ కితాబు
- రవి బిష్ణోయ్, అక్షర్ పటేల్ లను ప్రత్యేకంగా ప్రస్తావించిన వైనం
సూర్యకుమార్ యాదవ్ నాయకత్వం ఎంతోగానో ఆకట్టుకుందని, కుర్రాళ్లు తమకు అందివచ్చిన అవకాశాలను రెండు చేతులా ఒడిసిపట్టుకుని రాణించడం ఎంతో సంతోషం కలిగించిందని పేర్కొన్నాడు.
రవి బిష్ణోయ్, అక్షర్ పటేల్ ల గురించి ప్రత్యేకంగా చెప్పాలని, బ్యాటింగ్ కు అనుకూలిస్తున్న పిచ్ లపై వాళ్లిద్దరూ అద్భుతంగా బౌలింగ్ చేశారని అభినందించాడు. పది రోజుల పాటు జరిగిన ఈ సిరీస్ ను చిరస్మరణీయం చేసిన యావత్ టీమిండియాకు, సహాయక సిబ్బందికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని లక్ష్మణ్ పేర్కొన్నారు.