బెయిల్ పై విడుదలైన వైఎస్ భాస్కర్ రెడ్డి
- అనారోగ్యంతో బాధపడుతున్న వైఎస్ భాస్కర్ రెడ్డి
- దీంతో 12 రోజుల ఎస్కార్ట్ బెయిల్ మంజూరు చేసిన సీబీఐ కోర్టు
- హైదరాబాద్ లోనే చికిత్స పొందాలని ఆదేశం
హైదరాబాద్ ను వీడి వెళ్లరాదని, హైదరాబాద్ లోనే చికిత్స పొందాలని బెయిల్ షరతుల్లో కోర్టు పేర్కొంది. తిరిగి అక్టోబర్ 3న చంచల్ గూడ జైలు సూపరింటెండెంట్ ముందు సరెండ్ అవ్వాలని వైఎస్ భాస్కర్ రెడ్డిని సీబీఐ కోర్టు ఆదేశించింది. బెయిల్ మంజూరు కావడంతో వైఎస్ భాస్కర్ రెడ్డి జైలు నుంచి శుక్రవారం విడుదలయ్యారు. అనంతరం చికిత్స కోసం ఏఐజీ ఆస్పత్రికి వెళ్లిపోయారు. ఎస్కార్ట్ బెయిల్ కింద 12 రోజుల పాటు ముగ్గురు పోలీసులు వైఎస్ భాస్కర్ రెడ్డి వెంటే ఉంటారు.