‘స్కంద’ ట్రైలర్ లోడింగ్.. వేడుక, వేదిక ఖరారు
- ఈ నెల 26న శిల్పకళా వేదికలో ట్రైలర్ లాంచ్
- బోయపాటి దర్శకత్వంలో నటిస్తున్న రామ్, శ్రీలీల
- సెప్టెంబర్ 15న విడుదల కానున్న చిత్రం
సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ తేదీ, వేదిక ఖరారయ్యాయి. ఈ నెల 26న హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరిగే భారీ ఈవెంట్‌లో ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు. తమన్ సంగీతం అందించిన సినిమాను జీ స్టూడియోస్ సమర్పణలో శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. రామ్ కెరీర్‌లో మొదటిసారి వస్తున్న పాన్ ఇండియా సినిమా ఇదే కావడం విశేషం.