రామ్ చరణ్ సినిమాలో విలన్గా విజయ్ సేతుపతి!
- బుచ్చిబాబు సానతో సినిమాకు ఓకే చెప్పిన చరణ్
- జనవరిలో మొదలు కానున్న షూటింగ్
- ఉప్పెనలో విలన్గా నటించిన సేతుపతి
ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ చిత్రం షూటింగ్ జనవరిలో ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఈ సినిమాలో కీలక పాత్ర కోసం విజయ్ సేతుపతిని సంప్రదించగా ఆయన ఓకే చెప్పినట్టు టాలీవుడ్ సమాచారం. ఈ సినిమాలో విజయ్ ది ముఖ్యమైన పాత్రే కాకుండా విలన్ క్యారెక్టర్ అని తెలుస్తోంది. ఇప్పటికే ‘ఉప్పెన’ చిత్రంలో నటించిన సేతుపతి బుచ్చిబాబుపై నమ్మకంతో చరణ్ తో సినిమాకు ఒప్పుకున్నాడని తెలుస్తోంది. అయితే దీనిపై చిత్ర బృందం నుంచి ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు. ఒకవేళ సేతుపతి అంగీకరిస్తే మరో క్రేజీ కాంబినేషన్ అభిమానులను అలరించనుంది.