జీవో 31ని వెంటనే ఉపసంహరించుకోవాలి: తులసిరెడ్డి
- వాహనాల త్రైమాసిక పన్నును మళ్లీ 25 శాతం పెంచడం దారుణమన్న తులసిరెడ్డి
- పన్ను ఇప్పటికే పొరుగు రాష్ట్రాల కంటే 30 శాతం ఎక్కువగా ఉందని విమర్శ
- పెట్రోల్, డీజిల్ ధరలు కూడా ఇతర రాష్ట్రాల కంటే ఎక్కువగా ఉన్నాయని మండిపాటు
జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. పెట్రోల్, డీజిల్ ధరలు కూడా ఇతర రాష్ట్రాల కంటే ఏపీలోనే ఎక్కువ ఉన్నాయని విమర్శించారు. గ్రీన్ ట్యాక్స్ ను కూడా రూ. 200 నుంచి రూ. 20 వేలకు పెంచారని మండిపడ్డారు. రోడ్లు అధ్వానంగా ఉండటం వల్ల వాహనాలు దెబ్బతింటున్నాయని, పెరిగిపోయిన టైర్లు, స్పేర్ పార్టుల ధరల కారణంగా వాహనదారులకు భారం పెరిగిపోయిందని చెప్పారు.