'గాండీవధారి అర్జున' రిలీజ్ డేట్ ఖరారు!
- ప్రవీణ్ సత్తారు నుంచి 'గాండీవధారి అర్జున'
- యాక్షన్ ఎంటర్టైనర్ జోనర్లో నడిచే కథ
- సాక్షి వైద్య చేస్తున్న రెండో సినిమా ఇది
- ఆగస్టు 25వ తేదీన విడుదలవుతున్న సినిమా
ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 25వ తేదీన విడుదల చేయనున్నారు. అందుకు సంబంధించిన పోస్టర్ ను కొంతసేపటిక్రితం విడుదల చేశారు. 'ఏజెంట్' సినిమాలో అఖిల్ జోడీగా మెరిసిన సాక్షి వైద్య ఈ సినిమాలో హీరోయిన్.
మిక్కీ జె మేయర్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. యాక్షన్ సినిమాలను తెరకెక్కించడంలో ప్రవీణ్ సత్తారు కంటూ ఒక మార్క్ ఉంది. అందువలన సహజంగానే ఈ సినిమాపై అందరిలోను ఆసక్తి ఉంది. ఈ సినిమాతో వరుణ్ తేజ్ హిట్ కొడతాడేమో చూడాలి. ప్రవీణ్ సత్తారు కూడా ఈ హిట్ చాలా అవసరం.