కిరణ్ అబ్బవరం ఏడి? .. ఎక్కడా జాడ లేడేం?
- ఎలాంటి సినిమా నేపథ్యం లేని కిరణ్ అబ్బవరం
- వరుస సినిమాలతో స్పీడ్ చూపించిన హీరో
- కొత్త ప్రాజెక్టులలో కనిపించని పేరు
- సైలెంట్ అయిన హీరో
బలమైన సినిమా నేపపథ్యం కలిగిన హీరోలు .. వారసులుగా రన్నింగ్ రేసులో ఉన్నవారే ఒక్కో సినిమాను చేసుకుంటూ వెళుతుంటే, కిరణ్ అబ్బవరం వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్లడం అందరినీ ఆశ్చర్యపరిచింది. క్రితం ఏడాది మూడు సినిమాలను థియేటర్లకు తీసుకొచ్చిన ఆయన, ఆల్రెడీ ఈ ఏడాది అప్పుడే రెండు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చాడు.
సినిమాకి .. సినిమాకి మధ్య కిరణ్ పరిణతిని చూపిస్తూ వెళ్లాడు. డాన్సులలో .. ఫైట్లలో తనకంటూ ఒక స్టైల్ ను సెట్ చేసుకోవడం మొదలెట్టాడు. అలాంటి కిరణ్ నుంచి ఈ ఏడాది వచ్చిన సినిమాలు అంతంత మాత్రంగా ఆడాయి. అప్పటి నుంచి కొత్త ప్రాజెక్టులలో ఆయన పేరు కనిపించడం లేదు .. వినిపించడం లేదు. ఇంతకీ కిరణ్ అబ్బవరం ఎక్కడ ఉన్నట్టు? ఏం చేస్తున్నట్టు?