'అవినాశ్ రెడ్డిపై చర్యలు తీసుకోండి' అంటూ వైఎస్ సునీత మెమో.. పరిగణనలోకి తీసుకోని హైకోర్టు
- అవినాశ్ తల్లికి సర్జరీ జరగలేదని మెమోలో పేర్కొన్న సునీత
- అవినాశ్ కు బెయిల్ మంజూరు చేసిన న్యాయస్థానం
- సీబీఐ సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం
ఈ క్రమంలో సునీత మెమో దాఖలు చేశారు. అవినాశ్ తల్లికి ఎలాంటి సర్జరీ జరగలేదని, అవినాశ్ పై చర్యలు తీసుకోవాలని మెమోలో ఆమె కోరారు. అయితే ఆమె మెమోను హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. అవినాశ్ కు బెయిల్ మంజూరు చేసింది. మరోవైపు హైకోర్టు బెయిల్ ఆర్డర్ ను సీబీఐ అధికారులు పరిశీలిస్తున్నారు. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సీబీఐ సవాల్ చేసే అవకాశం ఉంది.