అవినాశ్ రెడ్డికి మళ్లీ నోటీసులిచ్చిన సీబీఐ.. 19న విచారణకు రావాలని ఆదేశం!
- ఈ రోజు విచారణకు రాలేనని సీబీఐకి అవినాశ్ రెడ్డి లేఖ
- నాలుగు రోజులు గడువు ఇవ్వాలని విజ్ఞప్తి
- సానుకూలంగా స్పందించిన సీబీఐ అధికారులు
- శుక్రవారం ఉదయం 11 గంటలకు రావాలని సూచన
వివేకా హత్య కేసు విచారణకు హాజరుకావాలంటూ ఎంపీ అవినాశ్ రెడ్డికి సోమవారం సీబీఐ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. మంగళవారం ఉదయం 11 గంటలకు సీబీఐ కార్యాలయంలో హాజరు కావాలని అందులో పేర్కొంది. ఈ నేపథ్యంలో ఈ రోజు సీబీఐకి లేఖ రాసిన అవినాశ్ రెడ్డి.. అత్యవసర పనుల కారణంగానే విచారణకు రాలేకపోతున్నానని చెప్పారు. నాలుగు రోజుల గడువు కావాలని కోరారు.