పార్టీలో అయిన వాళ్లే కుట్రలు చేసి ఇబ్బంది పెట్టారు: మాజీ మంత్రి బాలినేని
- ఒంగోలులో వైఎస్సార్ పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే బాలినేని
- అనంతరం జరిగిన సభలో ప్రసంగం
- నాయకులు తమను పట్టించుకోవట్లేదన్న అసంతృప్తి కార్యకర్తల్లో ఉందని వ్యాఖ్య
- సీఎం జగన్ బటన్ నొక్కి ప్రజలకు మేలు చేస్తున్నారని కామెంట్
తనకు రాజకీయంగా జీవితం ఇచ్చిన ఒంగోలు నుంచే రానున్న ఎన్నికల్లో పోటీ చేస్తానని బాలినేని స్పష్టం చేశారు. తనకు అయినవాళ్లు, కాని వాళ్లంటూ ఎవరూ లేరని, కావాల్సిందల్లా కార్యకర్తల మేలేనని చెప్పారు. వారి కోసం తమ పార్టీ నాయకుడు జగన్ మినహా ఎవ్వరినీ లెక్క చేయనని స్పష్టం చేశారు. మార్కాపురం, గిద్దలూరు, దర్శి నుంచి తాను పోటీ చేస్తానంటూ వస్తున్న వార్తలను ఈ సందర్భంగా ఆయన ఖండించారు. ఇప్పటివరకూ తనను అయిదు సార్లు గెలిపించిన కార్యకర్తల రుణం తీర్చుకుంటానంటూ భావోద్వేగపూరిత వ్యాఖ్యలు చేశారు.