ఏఆర్ రెహమాన్ భార్యకు తమిళం రాదా?: కస్తూరి ప్రశ్న
- అవార్డుల కార్యక్రమంలో తమిళం సరిగ్గా రాదన్న రెహమాన్ భార్య
- తమిళంలో రాకపోవడంపై నటి కస్తూరి శంకర్ ప్రశ్న
- నా భార్యను గౌరవిస్తానని సంగీత దర్శకుడి స్పందన
సైరాకు తమిళం రాకపోవడంపై నటి కస్తూరి శంకర్ ట్విట్టర్ వేదికగా స్పందించింది. రెహమాన్ భార్యకు తమిళం రాదా.. ఆమె మాతృభాష ఏమిటి.. వాళ్లు ఇంట్లో ఏ భాషలో మాట్లాడుకుంటారని ప్రశ్నించింది. దీనిపై స్పందించిన రెహమాన్ నా ప్రేమను నేను గౌరవిస్తానని తన భార్యకు మద్దతుగా సమాధానం ఇచ్చాడు. ఈ మేరకు తమిళంలో స్పందించాడు.