జగన్ ను కలిసేందుకు మహారాష్ట్ర నుంచి 800 కిమీ సైకిల్ తొక్కుతూ వచ్చిన రైతు
- ఎల్లలు దాటిన అభిమానం
- సీఎం జగన్ పై అభిమానం పెంచుకున్న మహారాష్ట్ర రైతు
- షోలాపూర్ జిల్లా నుంచి సైకిల్ తొక్కుతూ తాడేపల్లి చేరుకున్న వైనం
- ఆప్యాయంగా స్వాగతించిన సీఎం జగన్
ఈ నెల 17న మహారాష్ట్రలోని తన స్వస్థలం నుంచి ఓ సైకిల్ పై బయల్దేరాడు. 800 కిలోమీటర్లు సైకిల్ తొక్కుకుంటూ వచ్చి తాడేపల్లి చేరుకున్నాడు. క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ను కలిసి మురిసిపోయాడు.
కాక్డే గురించి తెలుసుకున్న సీఎం జగన్ ఆ రైతును ఆప్యాయంగా ఆహ్వానించారు. అతడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా, రైతు కాక్డే జగన్ బొమ్మ ఉన్న టీషర్టు ధరించాడు. దానిపై కాబోయే ప్రధాని జగన్ అంటూ రాసి ఉంది.