దసరా సినిమా బ్రిలియంట్ గా ఉందన్న మెగాస్టార్
- నాని, కీర్తి సురేశ్ నటనను మెచ్చుకున్న చిరంజీవి
- దర్శకుడిగా శ్రీకాంత్ ఓదెలకు తొలి సినిమా అంటే నమ్మశక్యంగా లేదని వ్యాఖ్య
- చిత్ర యూనిట్ పై ప్రశంసల జల్లు కురిపించిన మెగాస్టార్
దసరా సినిమా బ్రిలియెంట్ గా ఉందని మెగస్టార్ చిరంజీవి మెచ్చుకున్నారు. నానీ మేకోవర్ తో, తన ఫెర్ఫార్మెన్స్ తో అదరగొట్టాడని, కీర్తి సురేశ్ వావ్ అనేలా నటించిందని ప్రశంసించారు. యువ నటుడు దీక్షిత్ ఆకట్టుకున్నాడని చెప్పారు. అదేవిధంగా సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ పైనా చిరంజీవి ప్రశంసలు కురిపించారు. మొత్తంగా చిత్ర యూనిట్ అద్భుతమైన సినిమాను తెరకెక్కించిందని చిరంజీవి పొగడ్తల వర్షం కురిపించారు.
