ప్రతి ఒక్కరినీ బాల్యంలోకి తీసుకెళ్లే 'దసరా' పాట!
- నాని హీరోగా రూపొందిన 'దసరా'
- మాస్ లుక్ తోనే కనిపించనున్న కీర్తి సురేశ్
- సంతోష్ నరాలయం బాణీలకు మంచి మార్కులు
- ఈ నెల 30న ఐదు భాషల్లో విడుదలవుతున్న సినిమా
ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి నాలుగో లిరికల్ సాంగ్ ను వదిలారు. 'ఓ అమ్మలాలో .. అమ్మలాలో' అంటూ ఈ పాట సాగుతోంది. హీరో ... హీరోయిన్ బాల్యం, ఆ రోజుల్లో వాళ్లు గడిపిన ఆనందకరమైన క్షణాలు .. అనుభూతులను పంచుకున్న సంఘటనలను కలుపుకుంటూ ఈ పాట నడిచింది.
ఒకప్పటి బాల్యాన్ని కళ్ల ముందుంచే పాట ఇది. ప్రతి ఒక్కరికీ ఈ పాట కనెక్ట్ అవుతుంది. సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకి , సంతోష్ నారాయణ్ సంగీతాన్ని అందించాడు. ఈ నెల 30వ తేదీన ఈ సినిమా ఐదు భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. నానికి పెట్టుకున్న నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందనేది చూడాలి.