షారుక్ ఖాన్ తో సినిమాపై కన్నేసిన కీర్తి సురేశ్
- బాలీవుడ్ లో అడుగు పెట్టేందుకు రెడీ అయిన మహానటి
- మంచి కథ వస్తే తప్పకుండా హిందీలో చేస్తానని వెల్లడి
- ఈ నెల 30న విడుదలకానున్న నాని, కీర్తి నటించిన దసరా
దసరా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీర్తి ఈ విషయం చెప్పింది. బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ తో పని చేసేందుకు ఇష్టపడతానని మనసులో మాట బయట పెట్టింది. ఈ క్రమంలో తన పెళ్లి గురించి వస్తున్న పుకార్లపై కూడా కీర్తి స్పందించింది. ‘నేను చాలా కాలంగా వాటిని చదువుతున్నాను. అయితే వాటి గురించి చింతించడం, వాటికి ప్రతిస్పందించడం మానేశాను’ అని కీర్తి స్పష్టం చేసింది.