ఎంత మాత్రం తగ్గని 'ధమాకా' జోరు .. 5 రోజుల వసూళ్లు ఇవే!
- ఈ నెల 23న విడుదలైన 'ధమాకా'
- తొలిరోజునే వచ్చిన హిట్ టాక్
- రోజుకి 10 కోట్ల చొప్పున రాబడుతున్న సినిమా
- ఈ వారం కూడా తగ్గని వసూళ్ల జోరు
రవితేజ ఈ ఏడాది రెండు ఫ్లాపులను మూటగట్టుకున్నాడు. ఆయన అభిమానుల ఆశలన్నీ ఈ సినిమాపైనే పెట్టుకున్నారు. పూర్తి మాస్ కంటెంట్ తో వచ్చిన ఈ సినిమా, తొలి ఆటతోనే ఆడియన్స్ కనెక్ట్ అయింది. రవితేజ సినిమా నుంచి మాస్ ఆడియన్స్ ఆశించే అంశాలన్నీ పుష్కలంగా ఉండటమే ఈ సినిమా ఈ స్థాయి హిట్ కొట్టడానికి కారణం అనుకోవాలి. ఇక శ్రీలీల గ్లామర్ కూడా కొంత కలిసొచ్చింది.
ఈ వారంలో కూడా థియేటర్లలో దిగిపోవడానికి చెప్పుకోదగిన సినిమాలేం లేవు. ఈ సినిమాతో పాటు '18 పేజెస్' సినిమా బరిలోకి దిగినప్పటికీ, అది ఒక క్లాస్ లవ్ స్టోరీగా మార్కులు కొట్టేసింది. ఒక వర్గం ప్రేక్షకులు మాత్రమే ఆ సినిమాకి పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో కొన్ని రోజులపాటు 'ధమాకా' జోరు కొనసాగే అవకాశాలే కనిపిస్తున్నాయి.