నాతో సిరి చెప్పింది అదే .. అప్పటి నుంచి మారిపోయాను: శ్రీహాన్
- బిగ్ బాస్ లో టాప్ 2గా నిలిచిన శ్రీహాన్
- సిరి వచ్చి వెళ్లాక ఆటతీరు మార్చుకున్నానని వ్యాఖ్య
- పొరపాట్లు సరిచేసుకున్నానని వివరణ
- ఫ్రెండ్స్ ను దూరం పెట్టలేదని వెల్లడి
శ్రీహాన్ లో వచ్చిన ఈ మార్పు గురించి అతను లేని సమయంలో రేవంత్ - శ్రీసత్య మాట్లాడుకున్నారు కూడా. సిరి ఏదో చెప్పడం వల్లనే అతను శ్రీసత్య - రేవంత్ లను దూరం పెడుతున్నాడని అంతా అనుకున్నారు. తాజా ఇంటర్వ్యూలో శ్రీహాన్ కి ఇదే ప్రశ్న ఎదురైంది. అందుకు అతను తనదైన స్టైల్లో స్పందించాడు.
"ఫ్యామిలీ వీక్ లో సిరి హౌస్ లోకి వచ్చినప్పుడు నా నుంచి ఎంటర్టైన్మెంట్ తగ్గింది అని చెప్పింది. నేను కాస్త ఎక్కువగా వెటకారం చేస్తున్నానని అంది. ఎవరి సపోర్టును తీసుకోకుండా .. టాస్కులో ఫ్రెండ్షిప్ అనేది చూడకుండా ఆడమని చెప్పింది. అప్పటి నుంచి ఆ పొరపాట్లను సరిచేసుకుంటూ వచ్చాను. అంతే తప్ప ఫ్రెండ్స్ ను దూరం పెట్టలేదు" అంటూ చెప్పుకొచ్చాడు.