ఓ ఇంటివాడు అవుతున్న నాగశౌర్య!
- లవర్ బాయ్ గా నాగశౌర్యకి క్రేజ్
- వరుస సినిమాలతో తను చాలా బిజీ
- అనూషతో కుదిరిన సంబంధం
- బెంగళూరులో జరగనున్న వివాహం
ఒక వైపున బయట బ్యానర్లలోని సినిమాలతో .. మరో వైపున సొంత సినిమాలతో నాగశౌర్య బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఆయన చేతిలో మూడు ప్రాజెక్టుల వరకూ ఉన్నాయి. ఆ సినిమాలను లైన్లో పెట్టే పనిలోనే ఆయన ఉన్నాడు. వైవిధ్యం విషయంలోనే ప్రత్యేకమైన దృష్టి పెడుతున్నాడు. ఈ నేపథ్యంలో ఆయన పెళ్లి కొడుకు అవుతున్నాడనే విషయాన్ని పీఆర్వో వంశీ కాక ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.
అనూషతో నాగశౌర్య వివాహం జరగనున్నట్టుగా ఆయన చెప్పారు. వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఈ నెల 19 .. 20 తేదీలలో బెంగళూరులో జరుగుతాయనే విషయాన్ని ఆయన స్పష్టం చేశారు. అనూష ఎవరు? ఆమె ఫ్యామిలీ నేపథ్యం ఏమిటనేది తెలియాల్సి ఉంది. మొత్తానికి నాగశౌర్య ఒక ఇంటివాడు అవుతున్నాడన్న మాట.