ఆ 8 గుర్తులను తొలగించండి...ఈసీకి టీఆర్ఎస్ నేత వినోద్ కుమార్ వినతి
- మునుగోడు ఉప ఎన్నికలో కారును పోలిన 8 గుర్తులు
- వాటిని జాబితా నుంచి తొలగించాలంటున్న టీఆర్ఎస్
- ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసిన వైనం
- తాజాగా ఈసీ అధికారులను స్వయంగా కలిసిన వినోద్ కుమార్
టీఆర్ఎస్ అధిష్ఠానం ఆదేశాల మేరకు ఆ పార్టీ కీలక నేత, మాజీ ఎంపీ వినోద్ కుమార్ మంగళవారం సాయంత్రం ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయానికి వెళ్లారు. మునుగోడు ఉప ఎన్నికల్లో కారు గుర్తును పోలిన 8 గుర్తులను ఫ్రీ సింబల్స్ జాబితాలో ఉంచిన విషయాన్ని ఆయన ఎన్నికల సంఘానికి తెలిపారు. ఈ గుర్తులను స్వతంత్ర అభ్యర్థులకు కేటాయిస్తే తమ పార్టీ అభ్యర్థికి నష్టం జరుగుతుందని ఆయన ఎన్నికల సంఘానికి తెలిపారు. ఈ నేపథ్యంలో కారును పోలిన ఆ 8 గుర్తులను ఫ్రీ సింబల్స్ జాబితా నుంచి తొలగించాలని ఆయన ఎన్నికల సంఘాన్ని కోరారు.