'దసరా' నుంచి ధూమ్ ధామ్ లిరికల్ సాంగ్ రిలీజ్!
- నాని కథానాయకుడిగా రూపొందిన 'దసరా'
- ఆయనతో రెండోసారి జోడీ కడుతున్న కీర్తి సురేశ్
- సంగీత దర్శకుడిగా సంతోష్ నారాయణ్
- మార్చి 30వ తేదీన సినిమా విడుదల
తాజాగా ఈ సినిమా నుంచి లిరికల్ సాంగును విడుదల చేశారు. 'ఇచ్చి పడేద్దాం .. గుచ్చి పడేద్దాం .. ఎవ్వడడ్డమొత్తడో చూద్దాం .. బాంచత్. ధూమ్ ధామ్ దోస్తాన్ .. ఇరగమరగా జేద్దాం' అంటూ ఈ పాట సాగుతోంది. సంతోష్ నారాయణ్ సంగీతాన్ని సమకూర్చిన ఈ పాటకి కాసర్ల శ్యామ్ సాహిత్యాన్ని అందించాడు. తమ స్వభావాన్నీ .. జీవితాన్ని ఆవిష్కరిస్తూ మాస్ పాడుకునే పాట ఇది.
'నేను లోకల్' తరువాత నానితో కలిసి కీర్తి సురేశ్ నటించిన ఈ సినిమాపై అందరిలో ఆసక్తి ఉంది. మార్చి 30వ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు. రెండు ఫ్లాపులతో ఉన్న నాని, ఈ సినిమా తనకి తప్పకుండా హిట్ ఇస్తుందనే ఆశతో ఉన్నాడు. ఆయన ఆశను ఈ సినిమా ఎంతవరకూ నెరవేర్చుతుందో చూడాలి.