'పొన్నియిన్ సెల్వన్' ప్రీ రిలీజ్ ఈవెంట్ పై అందరిలో ఆసక్తి!
- మణిరత్నం నుంచి మరో భారీ చిత్రం
- చారిత్రక నేపథ్యంలో నడిచే కథ
- హైదరాబాదులో రేపు ప్రీ రిలీజ్ ఈవెంట్
- ఈ నెల 30వ తేదీన సినిమా రిలీజ్
ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ను ఆయా ముఖ్యమైన ప్రాంతాల్లో ప్లాన్ చేస్తున్నారు. తెలుగు వెర్షన్ కి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈ నెల 23వ తేదీన హైదరాబాద్ లో నిర్వహించనున్నట్టు మేకర్స్ తెలియజేశారు. దాంతో టాలీవుడ్ నుంచి చీఫ్ గెస్టుగా ఎవరు వస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి వస్తారనే టాక్ ఉంది.
ఇది చోళరాజుల కాలంలో .. చారిత్రక నేపథ్యంలో నడిచే కథ. అందుకు అవసరమైన సెట్స్ కోసం .. కాస్ట్యూమ్స్ కోసం కోట్ల రూపాయలను గుమ్మరించారు. ఏఆర్ రెహ్మాన్ సంగీతం ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళుతుందని అంటున్నారు. చాలా గ్యాప్ తరువాత సౌత్ లో ఐశ్వర్య రాయ్ చేసిన సినిమా ఇది. కాకపోతే ఈ సినిమాకి 'పీఎస్ 1' అని టైటిల్ పెట్టడమే తెలుగు ఆడియన్స్ కి అసంతృప్తిని కలిగిస్తోంది.