బాలకృష్ణ 108వ సినిమా ప్రకటన వచ్చేసింది!
- షూటింగు దశలో బాలకృష్ణ 107వ సినిమా
- 108వ సినిమాకి సన్నాహాలు
- దర్శకుడిగా అనిల్ రావిపూడి
- సంగీత దర్శకుడిగా తమన్
ఆయా ఇంటర్వ్యూలలో అనిల్ రావిపూడి ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. ఈ ప్రాజెక్టును గురించి బాలకృష్ణ కూడా ధ్రువపరచడం జరిగింది. తాజాగా ఈ సినిమా పైకి సంబంధించిన ఎనౌన్స్ మెంట్ వీడియోను వదిలారు. పవర్ఫుల్ సబ్జెక్ట్ తో ఈ సినిమా రూపొందనున్న విషయాన్ని ఈ వీడియో ద్వారా చెప్పేశారు.
సాహు గారపాటి - హరీశ్ పెద్ది ఈ సినిమాను నిర్మించనున్నారు. తమన్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. ఈ కథ తండ్రీకూతుళ్ల అనుబంధం చుట్టూ తిరుగుతుందనీ, కూతురు పాత్రలో శ్రీలీల చేయనుందనే విషయాన్ని ఇంతకుముందే అనిల్ రావిపూడి చెప్పిన సంగతి తెలిసిందే. ఇక బాలయ్య సరసన ఎవరు కథానాయికగా చేయనున్నారనే విషయంలోనే క్లారిటీ రావలసి ఉంది.