'కృష్ణ వ్రింద విహారి' రిలీజ్ డేట్ ఖరారు!
- విభిన్న కథా చిత్రంగా 'కృష్ణ వ్రింద విహారి'
- కథానాయికగా షిర్లే సెటియా
- సంగీత దర్శకుడిగా మహతి స్వరసాగర్
- సెప్టెంబర్ 23వ తేదీన విడుదల
మే 20వ తేదీనే ఈ సినిమాను విడుదల చేయాలనుకున్నారు. ఆ డేట్ తోనే ప్రమోషన్స్ చేస్తూ వచ్చారుగానీ, పరిస్థితులు అనుకూలించకపోవడం వలన విడుదల చేయలేదు. తాజాగా కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించారు. సెప్టెంబర్ 23వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు చెబుతూ, అందుకు సంబంధించిన పోస్టర్ ను వదిలారు.
మహతి స్వరసాగర్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో రాధిక కీలకమైన పాత్రను పోషించింది. వెన్నెల కిశోర్ .. రాహుల్ రామకృష్ణ ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. టైటిల్ ను బట్టి ఇది ట్రయాంగిల్ లవ్ స్టోరీ అనే విషయం తెలుస్తోంది. ఈ సినిమా ఎలాంటి రిజల్టును రాబడుతుందో చూడాలి.