తిరుమలలో జరిగిన దానిపై క్షమాపణలతో విఘ్నేశ్ శివన్ లేఖ
- కాళ్లకు చెప్పులు ఉన్నాయనే విషయాన్ని మరిచామని వివరణ
- దేవుడిపై ఎంతో నమ్మకం, విశ్వాసం ఉన్నట్టు ప్రకటన
- దయచేసి క్షమించాలని వేడుకుంటూ టీటీడీకి లేఖ
‘‘తిరుమలలోనే పెళ్లి చేసుకోవాలన్నది మా కోరిక. అందుకే గత నెల రోజుల్లో తిరుమలకు ఐదు సార్లు వచ్చి వెళ్లాం. కానీ, అనివార్య కారణాల వల్ల మహాబలిపురంలో పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. దీంతో పెళ్లి అయిన వెంటనే నేరుగా తిరుమలకు వచ్చి స్వామివారి కల్యాణ సేవలో పాల్గొనాలన్నది మా ఆలోచన. అదే ఆలోచనతో తిరుమలకు వచ్చి స్వామివారి దర్శనం చేసుకున్నాం. దర్శనం తర్వాత ఆలయం ముందు ఫొటోలు తీసుకున్నది.. మా పెళ్లి ఎప్పటికీ గుర్తుండిపోవాలనే. ఈ హడావిడిలో మా కాళ్లకు చెప్పులు ఉన్నాయనే విషయాన్ని మర్చిపోయాం. దేవుడిపై మాకు ఎంతో నమ్మకం ఉంది. దయచేసి మమ్మల్ని క్షమించండి’’ అంటూ విఘ్నేశ్ శివన్ లేఖలో కోరారు.