ఆ క్షణాలను మరిచిపోలేను: 'మేజర్' డైరెక్టర్!
- వసూళ్ల పరంగా దూసుకుపోతున్న 'మేజర్'
- ప్రమోషన్స్ కొనసాగిస్తున్న టీమ్
- సందీప్ గారి తల్లి స్పందన గర్వంగా అనిపించిందన్న దర్శకుడు
- రానా .. బన్నీ ప్రోత్సాహం మరిచిపోలేనంటూ వ్యాఖ్య
తాజా ఇంటర్వ్యూలో శశికిరణ్ తిక్క మాట్లాడుతూ .. "ఈ సినిమా చూడగానే మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ గారి తల్లి నన్ను ఆప్యాయంగా హత్తుకుని భావోద్వేగానికి లోనయ్యారు. ఆమెకి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నానని అప్పుడు అనిపించింది. ఆ క్షణాలను నేను ఎప్పుడూ మరిచిపోలేను.
ఇక మహేశ్ బాబుగారు అభినందించినప్పుడు కూడా, నాపై ఆయన ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నానని అనిపించింది. ఇక ఈ సినిమా చూడగానే రానా .. అల్లు అర్జున్ ఇద్దరూ కూడా వెంటనే నాకు కాల్ చేశారు. ఈ సినిమాలోని ఎమోషన్ తమకి బాగా కనెక్ట్ అయిందంటూ ప్రశంసించారు. నిజంగా ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది" అంటూ చెప్పుకొచ్చాడు.