'అఖండ' సీక్వెల్ కథపై జరుగుతున్న కసరత్తు!
- 'అఖండ'తో సంచలన విజయాన్ని సాధించిన బోయపాటి
- సీక్వెల్ ఉందంటూ ముందుగానే ఇచ్చిన హింట్
- సీక్వెల్ కథపై పనిచేస్తున్న రైటింగ్ డిపార్టుమెంట్
- బాలయ్య కమిట్ మెంట్స్ పూర్తి కాగానే సెట్స్ పైకి
అలాంటి ఈ సినిమాకి సీక్వెల్ ఉందన్నట్టుగా బోయపాటి హింట్ ఇచ్చాడు. ఆ తరువాత ఈ సినిమాకి సంబంధించిన వేదికలపై ఆయన మాట్లాడుతూ కూడా ఈ సినిమాకి సీక్వెల్ ఉందనే క్లారిటీ ఇచ్చాడు. అయితే అందుకు సమయం ఉందని చెప్పాడు. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ కథపైనే బోయపాటి రైటింగ్ డిపార్టుమెంట్ వర్క్ చేస్తున్నట్టుగా సమాచారం.
ఈ సినిమాలోని పాప .. టీనేజ్ లోకి అడుగుపెట్టడం .. ఆమెకి ఇచ్చిన మాట కోసం అఖండ మళ్లీ రావడంతో సీక్వెల్ కథ మొదలవుతుందని అంటున్నారు. గోపీచంద్ మలినేని .. అనిల్ రావిపూడి సినిమాలను బాలయ్య పూర్తి చేసిన తరువాత, ఆయనను తీసుకుని బోయపాటి సెట్స్ పైకి వెళతాడని చెబుతున్నారు.