కుటుంబ కలహాలే కారణం.. ధనుష్, ఐశ్వర్యలు విడిపోవడంపై నిర్మాత కస్తూరిరాజా స్పందన
- సాధారణ కుటుంబాల్లో ఉండే గొడవలే
- నేను ఇద్దరితోనూ మాట్లాడాను
- సలహాలు కూడా ఇచ్చాను
- ధనుష్ తండ్రి, నిర్మాత కస్తూరి రాజా వెల్లడి
దీనిపై ఓ మీడియా సంస్థతో కస్తూరి రాజా మాట్లాడారు. ‘‘సాధారణ కుటుంబాల్లో మాదిరే ధనుష్, ఐశ్వర్య మధ్య కూడా కలహాలున్నాయి. అవి ముగిసేవి కావు. నేను ఇద్దరితోనూ ఫోన్లో మాట్లాడాను. కొన్ని సలహాలు కూడా ఇచ్చాను’’ అని కస్తూరి రాజా తెలిపారు.
18 ఏళ్ల వివాహ బంధం తర్వాత ఎవరికి వారు తమ మార్గంలో నడవాలని నిర్ణయించుకున్నామని ధనుష్ ప్రకటించడం తెలిసిందే. ఐశ్వర్య, ధనుష్ కు 2004లో వివాహమైంది. వీరి నిర్ణయాన్ని అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు.