'పుష్ప' ట్రైలర్ రిలీజ్ కి ముహూర్తం ఖరారు!
- సుకుమార్ నుంచి 'పుష్ప'
- అల్లు అర్జున్ తో మూడో సినిమా
- డిసెంబర్ 6వ తేదీన ట్రైలర్ విడుదల
- 17వ తేదీన సినిమా విడుదల
డిసెంబర్ 6వ తేదీన ట్రైలర్ ను విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. అందుకు సంబంధించిన అధికారిక పోస్టర్ ను వదిలారు. ఇంతవరకూ ఈ సినిమా నుంచి వదిలిన ప్రతి పాటకు అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. దేవిశ్రీ ప్రసాద్ కి మంచి మార్కులు పడ్డాయి. ఇక ట్రైలర్ తో మరింతగా అంచనాలు పెంచే కసరత్తు జరుగుతోంది.
రష్మిక కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో, ప్రతినాయకుడిగా ఫాహద్ ఫాజిల్ కనిపించనున్నాడు. సునీల్ .. అనసూయ పాత్రలను పరిచయం చేసిన దగ్గర నుంచి, ఈ సినిమాపై మరింత ఆసక్తి పెరుగుతూ పోతోంది. వచ్చేనెల 12వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జరపనున్నట్టు ఒక టాక్ వినిపిస్తోంది.
.