సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- అల్లు అర్జున్ కి జోడీగా కీర్తి సురేశ్?
- మెగాస్టార్ తో త్రివిక్రమ్ సినిమా
- మారేడుమిల్లి అడవుల్లో రవితేజ
* మెగాస్టార్ చిరంజీవి, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఓ సినిమా వస్తుందంటూ గత కొంత కాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి విదితమే. ఈ క్రమంలో తాజాగా ఈ ప్రాజక్టు ఓకే అయినట్టు తెలుస్తోంది. డీవీవీ ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ నిర్మించే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడుతుంది.
* రవితేజ హీరోగా శరత్ మండవ దర్శకత్వంలో రూపొందుతున్న 'రామారావు ఆన్ డ్యూటీ' చిత్రం షూటింగ్ నిన్నటి నుంచి తూర్పు గోదావరి జిల్లా మారేడుమిల్లి అడవుల్లో జరుగుతోంది. ఇక్కడ కొన్ని యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇక ఈ షెడ్యూలు తర్వాత పాటల చిత్రీకరణ కోసం యూనిట్ విదేశాలకు వెళుతుంది.